నైనా ఫిలిమ్స్ పతాకం పై యశ్ ,ప్రేమ్ కుమార్, శ్రీయ నటీనటులు గా రూప అయ్యర్ దర్శకత్వం లో షాన్వాజ్ నిర్మించిన చిత్రం " మహా చంద్ర".ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత షాన్వాజ్ మాట్లాడుతూ " కన్నడ లో సూపర్ హిట్ అయిన చంద్ర చిత్రాన్ని మహా చంద్ర పేరు తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.యశ్ ఈ చిత్రంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. అలాగే శ్రీయ తన అద్భుతమైన నటన తో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాం. అన్నారు. దామోదర వనాఛార్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం: గౌతమ్ శ్రీ వాస్తవ, కెమెరా: దాస్, నిర్మాత:షాన్వాజ్, దర్శకత్వం:రూప అయ్యర్.